: తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం తక్షణ సాయం
హుదూద్ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ సాయం ప్రకటించారు. ఈ మేరకు చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష అందిస్తామని చెప్పారు. ఇక, పశువులు మృతి చెందితే రూ.20 వేలు, మత్స్యకారులకు వలకు రూ.5వేలు, పడవలు నష్టపోయిన వారికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేగాక, సాయంత్రానికల్లా బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, కిరోసిన్ ను పౌరసరఫరాల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని చంద్రబాబు వివరించారు.