: ఇటు వెన్నునొప్పి... అటు షూటింగులు ... సతమతమవుతున్న పవన్!
కొంతకాలంగా పవన్ కల్యాణ్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి, సర్జరీ మినహా మరో మార్గం లేదని డాక్టర్లు తేల్చిచెప్పడంతో పవన్ ఆపరేషన్ కు రెడీ అయ్యాడని తెలుస్తోంది. అయితే, ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలో క్లారిటీ లేక పవన్ సతమతమవుతున్నాడని సమాచారం. సర్జరీ జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించడంతో పవన్ ఆలోచనలో పడ్డాడని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పవన్ 'గోపాల గోపాల' క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరొకొన్ని రోజుల్లో, ఈ సినిమాకు సంబంధించి ఆయన వర్క్ పూర్తవుతుంది. దీంతో, వచ్చే నెల నుంచి గబ్బర్ సింగ్- 2 ను సెట్స్ పైకి తేవాలనుకున్నాడు పవన్. అయితే, ఇటీవల కాలంలో వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో గబ్బర్ సింగ్- 2ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై పవన్ డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది. ముందు సర్జరీ చేయించుకుని... ఆ తర్వాత కొన్నాళ్లు బెడ్ రెస్ట్ తీసుకుని, గబ్బర్ సింగ్-2 ప్రారంభించాలా? లేక గబ్బర్ సింగ్- 2ను పూర్తి చేసి సర్జరీ చేయించుకోవాలా? అని పవన్ మీమాంసలో పడినట్టు సమాచారం. ముందు సర్జరీ చేయించుకుంటే, గబ్బర్ సింగ్ మరింత ఆలస్యమవుతుంది. ఇప్పటికే గబ్బర్ సింగ్- 2 అనేక కారణాల వల్ల చాలా ఆలస్యమైంది. ఈ ప్రాజెక్ట్ ను మరింత ఆలస్యం చేయడం ఆయనకు ఇష్టం లేదు. పోనీ, గబ్బర్ సింగ్- 2 షూటింగ్ పూర్తయిన తర్వాత సర్జరీ చేయించుకుందామంటే, తన శరీరం అప్పటివరకు ఏమేరకు సహకరిస్తుందో అని పవన్ అనుమానంగా ఉన్నాడని సమాచారం. దీంతో, ఆయన ఈ విషయంపై సన్నిహితుల అభిప్రాయాలను తీసుకుంటున్నాడని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.