: చిరంజీవి ఇంటికి వాస్తు మార్పులు
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వాస్తు కొత్తకళను తీసుకురానుంది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత ఆయనపై అభిమానం తగ్గుతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవ్వడంతో ఆయనను పట్టించుకునేవారే కరవయ్యారు. సినిమాల్లో నటించి మరోసారి తన ఛరిష్మా పెంచుకోవాలని చిరు భావిస్తున్నారు. దీంతో సినిమాల్లో రాణించాలంటే అన్నీ అనుకూలంగా ఉండాలి అని ఆయన పూర్తిగా భావిస్తున్నారు. అందుకే చిరంజీవి ముందుగా ఇంటి నుంచి మార్పులు ప్రారంభించారు. ఇంటికి వాస్తు మార్పులు చేస్తే బాగుంటుందన్న సన్నిహితుల సలహా మేరకు ఆయన మార్పులు చేర్పులు చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో చిరంజీవి ఇంటి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆయన స్థాయికి తగ్గట్టుగా అద్భుతమైన డిజైన్ తో ఆ ఇంటికి కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. ఇంట్లో పనులు జరుగుతున్నందునే చిరు కుటుంబ సమేతంగా హాలీడే ట్రిప్ కు వెళ్లినట్టు భావిస్తున్నారు. దీంతో ఆయన తిరిగి వచ్చేనాటికి ఆయన నివాసం కొత్తకళ సంతరించుకోనుంది.