: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు చర్యల వల్లే నష్టం తగ్గింది: నిర్మలా సీతారామన్
హుదూద్ తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడినా, నష్టం పెద్దగా వాటిల్లకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో తెలుగు అకాడమీ 27వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాల్సి ఉందని అన్నారు. జిల్లాల వారీగా తుపాను నష్టంపై ఇంకా పూర్తి వివరాలు అందలేదని చెప్పారు. కేంద్రం తరపున ఏపీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.