: జయకు జైలుశిక్ష పడడంలో రంగారెడ్డి జిల్లా 'ద్రాక్ష తోట' కీలకపాత్ర పోషించిందా?


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అనూహ్యరీతిలో జైలు శిక్ష పడడం అటు అభిమానులను, ఇటు రాజకీయ వర్గాలను నివ్వెరపరిచింది. ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారన్న కేసులో ఆమెకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించారు. అసలా శిక్ష పడేందుకు తెలంగాణ రాష్ట్రంలో జయ పేరిట ఉన్న ద్రాక్ష తోటే కారణమని తెలుస్తోంది. ఎలాగంటే, జయకు రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో 14.50 ఎకరాల సాగు భూమి ఉంది. అందులోని ద్రాక్ష తోట ద్వారా 1991-96 మధ్య కాలంలో రూ.50.50 లక్షల ఆదాయం వచ్చిందని ఆమె ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కు వివరాలు సమర్పించారు. కానీ, ఆమెపై కేసు విచారణలో ఇవన్నీ అవాస్తవాలేనని స్పష్టమైంది. వివిధ శాఖల సమన్వయంతో ఈ ద్రాక్ష తోట ఆదాయంపై నిగ్గు తేల్చగా, జయ క్షేత్రంలో సాగుబడిలో ఉన్న ద్రాక్ష తోటలో సాలీనా ఎకరాకు రూ.20 వేలకు మించి ఆదాయం వచ్చే అవకాశం లేదని స్పష్టమైంది. అందునా, ద్రాక్ష 4.86 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారని, మిగిలిన భూమిలో కూరగాయలు పండిస్తున్నారని తెలిసింది. ఈ వివరాల ఆధారంగా, జయ తెలిపిన స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం లేదని ప్రత్యేక న్యాయస్థానం అభిప్రాయపడిందట.

  • Loading...

More Telugu News