: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పై విచారణ మరోసారి వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కౌన్సెలింగ్ కోసం తెలంగాణలోని 174 కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. మిగిలిన అన్ని కళాశాలలకు కౌన్సెలింగ్ అవకాశం కల్పించినట్లు నిర్థారిస్తూ ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, జేఎన్ టీయూ హెచ్ లకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.