: జైల్లో అగరబత్తీలు తయారుచేస్తున్న 'పురుచ్చితలైవి'!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత అగరబత్తీలు తయారుచేస్తున్నారట. జైల్లో ఖైదీలకు వివిధ పనులు కేటాయించడం తెలిసిందే. టైలరింగ్, కూరగాయలు కోయడం తదితర పనుల్లో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు ఈ మాజీ ముఖ్యమంత్రికి కల్పించారు పరప్పణ సెంట్రల్ జైలు అధికారులు. అయితే, ఆరోగ్యరీత్యా ఈ పనుల నుండి మినహాయింపు పొందాలని జయ భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ఆమెకు అగర్ బత్తీల తయారీ పని అప్పగించారట. నిన్నటిదాకా మహారాణిలా బతికిన జయ, నేడు ఓ సాధారణ వ్యక్తిలా అగర్ బత్తీలు తయారుచేస్తుండడం అభిమానులకు చేదువార్తే!