: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేస్తానంటూ అమీర్ ప్రతిజ్ఞ


సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న బాలీవుడ్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది అమీర్ ఖానే. తన 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో, దేశాన్ని వేధిస్తున్న సామాజిక సమస్యలనే అంశాలుగా ఎంచుకుంటాడీ మిస్టర్ పర్ఫెక్షనిస్టు. ఈ కార్యక్రమంలో భాగంగా 'రోడ్డు ప్రమాదాలా? లేక హత్యలా?' పేరిట ఓ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సందర్భంగా అమీర్ ఓ ప్రతిజ్ఞ చేశాడు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడితే చూస్తూ నిలుచోనని, క్షతగాత్రులకు వెంటనే సాయం చేస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్ సైట్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. భారత్ లో రోజుకు సగటున 380 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని, దీనిపై ఎవరూ శ్రద్ధ పెట్టడంలేదని అందులో పేర్కొన్నారు. వీటిలో అత్యధికం రోడ్డు ప్రమాదాలని కొట్టిపారేయలేమని, వాస్తవానికి అవి హత్యలన్న అంశాన్ని తాజా ఎపిసోడ్ లో ఫోకస్ చేశారు.

  • Loading...

More Telugu News