: విశాఖ చేరుకున్న చంద్రబాబు... కలెక్టరేట్ లో సమీక్ష


ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్న ఆయన విశాఖ కలెక్టరేట్ కు వెళ్లారు. అనంతరం మంత్రులు, అధికారులతో తుపాను నష్టంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి విమానంలో బయలుదేరిన ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులను అడిగి తుపాను అధిక ప్రభావం చూపిన ప్రాంతాల గురించి బాబు తెలుసుకున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సీఎంతో పాటు ఉన్నారు.

  • Loading...

More Telugu News