: 'సాయి బాబా' వివాదంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరణ
సాయి బాబాపై ద్వారకాపీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద చేసిన వ్యాఖ్యల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయని భక్తులు భావించినట్టయితే వారు శంకరాచార్యపై సివిల్, లేక, క్రిమినల్ కేసు దాఖలు చేసుకోవచ్చని సూచించింది. సాయిపై శంకరాచార్య చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను కేంద్రం అడ్డుకునేలా ఆదేశాలు జారీచేయాలని సుప్రీంలో నెల కిందట సాయిధామ్ చారిటబుల్ ట్రస్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం పైవిధంగా పేర్కొంది,.