: ఐఎస్ఎల్ లో నేడు తొలి మ్యాచ్ ఆడనున్న సచిన్ జట్టు
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ లీగ్ పోటీల్లో నేడు సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్ ఎఫ్ సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సీ జట్టుతో తలపడనుంది. లీగ్ ఆదివారం నాడు ఆరంభం కాగా, తొలి మ్యాచ్ లో గంగూలీ జట్టు అట్లెటికో డి కోల్ కతా 3-0తో ముంబయి ఎఫ్ సీని చిత్తు చేసింది. సోమవారం సాయంత్రం ఏడింటికి ఆరంభంకానున్న కేరళ-నార్త్ఈస్ట్ మ్యాచ్ లీగ్ లో రెండోది. సచిన్ జట్టు మ్యాచ్ ఆడుతుండడంతో అందరి దృష్టి ఈ పోరుపై పడింది. ఈ పోరుకు అసోంలోని గౌహతి వేదిక. కేరళ జట్టులో కీలక ఆటగాడైన డేవిడ్ జేమ్స్, అటు, టీం మేనేజర్ గానూ వ్యవహరిస్తున్నాడు. జేమ్స్ ఇంగ్లండ్ మాజీ గోల్ కీపర్. అయితే, ఆటగాడిగా బరిలో దిగుతాడా? లేక, మేనేజర్ పాత్రకే పరిమితమవుతాడా? అన్నది తెలియరాలేదు.