: బీసీీసీఐ నుంచి ఫీజులు బాగా రాబడుతున్న 'ఆ ఇద్దరు'


భారత క్రికెట్ కు ఆటగాళ్ళుగా ఎనలేని సేవలు అందించిన క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి ముందువరుసలో ఉంటారు. కెరీర్ కు ముగింపు పలికిన తర్వాత వ్యాఖ్యాతలుగా, సలహాదారులుగా వీరిద్దరూ భారత్ క్రికెట్ తో ప్రస్థానం సాగిస్తున్నారు. ఆ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా వీరిని విశేషంగా ప్రోత్సహిస్తోంది. వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నందుకే ఏడాదికి రూ.4 కోట్లు ముట్టజెబుతోంది బోర్డు. కామెంట్రీయే కాకుండా గవాస్కర్ ఐపీఎల్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, రవిశాస్త్రి టీమిండియా డైరక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో, ఇద్దరికీ చెరో రూ.2 కోట్లు బోనస్ గా ప్రకటించింది బోర్డు. ఇక, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఫీజు రూపేణా గిట్టుబాటవుతోంది రూ.2.49 కోట్లు (35 మ్యాచ్ లకు గాను). మ్యాచ్ ఫీజుల మొత్తం కంటే ఆరున్నర రెట్లు అధికంగా వాణిజ్య ఒప్పందాల ద్వారానే రాబడుతున్నాడట ధోనీ.

  • Loading...

More Telugu News