: విశాఖ-విజయవాడ రైళ్ల రాకపోకలకు అంతరాయం


తుపాను ప్రభావంతో విశాఖ జిల్లా ఎలమంచిలి, అనకాపల్లి మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో, విశాఖ-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాస్తవానికి తుపాను ప్రభావం తొలగిపోవడంతో, ఈ రోజు రైలు సర్వీసులను పునరుద్ధరించే పనిలో రైల్వే అధికారులు ఉన్నారు. ట్రాక్ దెబ్బ తినడంతో పునరుద్ధరణకు అడ్డంకి ఏర్పడింది. పరిస్థితిని సమీక్షించేందుకు దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ఆధ్వర్యంలోని ఓ బృందం ప్రత్యేక రైలులో సికింద్రాబాదు నుంచి బయలుదేరింది.

  • Loading...

More Telugu News