: ఉత్తరాంధ్రలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. తీవ్ర గాలులకు విద్యుత్ స్తంభాలు, టవర్లు కూలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. తుపాను నేపథ్యంలో, ఆదివారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తిరిగి వెంటనే విద్యుత్ ను పునరుద్ధరించలేనంతగా విద్యుత్ వ్యవస్థ నాశనమయింది. మరో నాలుగు రోజుల వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేమని అధికారులు చెబుతున్నారు.