: మరో 12 గంటలు అల్లకల్లోలంగానే సముద్రం... జగదల్ పూర్ సమీపంలో హుదూద్
హుదూద్ తుపాను క్రమేణా బలహీనపడుతోంది. ప్రస్తుతం ఇది ఛత్తీస్ ఘఢ్ లోని జగదల్ పూర్ సమీపంలో కేంద్రీకృతమయింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నానికి గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్లకు తగ్గనుంది. హుదూద్ ప్రభావం తగ్గినప్పటికీ... మరో 12 గంటల పాటు సముద్రం అల్లకల్లోలంగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఉదయానికి సముద్రంలో పీడనం తగ్గి... సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపింది.