: బెంగళూరులో వరుస పేలుళ్లు


బెంగళూరుపై ఉగ్రవాదులు పంజా విసిరారు. హైదరాబాద్ దిల్ షుక్ నగర్ లో జంట బాంబు పేలుళ్లుకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు బెంగుళూరును తమ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఉదయం మల్లేశ్వరంలో స్కూటర్ బాంబును పేల్చిన ఉగ్రవాదులు.. హెబ్బల్ ప్రాంతంలో మరో స్కూటర్ బాంబు పేలుడుకు పాల్పడ్డారు. హెబ్బల్ పేలుడులో 15 మంది గాయపడగా.. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇక్కడి ఫ్లై ఓవర్ కింద పేలని మరో బాంబు ఉందన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం మల్లేశ్వరం ఘటనలోనూ 18 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News