: పీఎస్ఎల్వీ సీ-26 కౌంట్ డౌన్ ప్రారంభం


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ సీ-26 కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఈ ఉదయం 6 గంటల 32 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని ఇస్రో ప్రకటించింది. 67 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్న ఈ రాకెట్ ద్వారా భారత నావిగేషన్ శాటిలైట్ 'ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ'ని నింగిలోకి పంపుతారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీనే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా... సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. భారత కాలమానం ప్రకారం, అక్టోబర్ 16 తెల్లవారుజామున 1.32 గంటలకు షార్ స్పేస్ సెంటర్ లోని ఒకటవ లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ-26 ని ప్రయోగిస్తారు.

  • Loading...

More Telugu News