: పన్నీర్ సెల్వం సహాయాన్ని కోరాం: చంద్రబాబు
తుపాను బాధితులను ఆదుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహాయాన్ని కోరామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖకు వెళుతున్న ఆయన రాజమండ్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అక్కడే ఉంటానని చెప్పారు. పెను తుపానుతో ఎంతో విధ్వంసం జరిగిందని... శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానంతో నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని తెలిపారు.