: 'శ్రీదేవి' విషయమై వివరణ ఇచ్చిన వర్మ
'శ్రీదేవి' సినిమా విషయమై నటి శ్రీదేవి తనకు నోటీసులు పంపిన నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివరణ ఇచ్చారు. తన సినిమా కథకు, నటి శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన సినిమాలో శ్రీదేవి వేరని, నిజజీవితంలో శ్రీదేవి వేరని, అలాంటప్పుడు రాద్ధాంతం చేయడం ఎందుకని వర్మ ప్రశ్నించారు. తాము ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ నుంచి హక్కులు పొందామని తెలిపారు.