: బలహీన పడుతున్న హుదూద్ తుపాను
ఎంత వేగంగా వచ్చిందో, అంతే వేగంగా హుదూద్ బలహీనపడుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని గంటల్లోగా హుదూద్ తుపాను అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు ప్రకటించింది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది. ఆదివారం ఉదయం పెను ఉప్పెనలా విరుచుకుపడిన హుదూద్ కారణంగా ఏపీలో నలుగురు చనిపోయారు. నాలుగు జిల్లాలపై హుదూద్ పెను ప్రభావాన్నే చూపింది. విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసిన హుదూద్, శ్రీకాకుళం జిల్లాను వరద ప్రమాదం అంచున నిలిపింది. ఒక్కరోజులోనే శాంతించిన హుదూద్ తుపాను, అల్పపీడనంగా మారితే పెద్ద ప్రమాదమేమీ ఉండకపోవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.