: హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా గుర్తించండి: ప్రధానికి చంద్రబాబు లేఖ


ఉత్తరాంధ్రలో పెను విలయం సృష్టిస్తున్న హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం మధ్యాహ్నం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆదివారం ఉదయం విరుచుకుపడిన హుదూద్ తుపాను మధ్యాహ్నానికే నలుగురు ప్రాణాలను బలిగొనడంతో పాటు విశాఖ నగరంలో విధ్వంసం సృష్టించిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణ సహాయం కింద రూ.2 వేల కోట్లను విడుదల చేయాలని బాబు ప్రధానిని కోరారు.

  • Loading...

More Telugu News