: శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న వరద ముప్పు
హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే జిల్లా పరిధిలో నాగావళి, వంశధార నదులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళం దాదాపుగా నీట మునిగింది. బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థ స్తంభించింది. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున వృక్షాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే యత్నాలు ముందుకు సాగడం లేదు. మరోవైపు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.