: ఈ లక్నో బాలిక కంట రక్తకన్నీరు!


లక్నోకు చెందిన ట్వింకిల్ ద్వివేది అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమెకో ప్రత్యేకత ఉంది. అందరూ ఏడ్చినపుడు కన్నీళ్ళొస్తే, ఈ 13 ఏళ్ళ బాలిక ఏడ్చితే రక్తం వస్తుంది! ఇదో అంతుచిక్కని వ్యాధి అని వైద్యులు అంటున్నారు. దీనికి పేరు కూడా లేదట. గత రెండేళ్ళుగా ఆమె తల నుంచి, చేతుల నుంచి, పాదాల నుంచి కూడా రక్తం వస్తోంది. తమ కుమార్తెకు సోకిన ఈ వ్యాధిని నయం చేయించేందుకు ట్వింకిల్ తల్లిదండ్రులు తిరగని చోటంటూలేదు. క్షుద్రశక్తుల కారణంగా ఇలా జరుగుతుందేమోనన్న అనుమానంతో వారు మతగురువులను కూడా కలిశారు. ఫలితం శూన్యం! స్థానిక వైద్యుడొకరు ఆమెను ఎయిమ్స్ కు తీసుకెళ్ళాలని సూచించాడు. అక్కడి డాక్టర్లు ట్వింకిల్ కు జబ్బేమీలేదని, ఆమె తల్లిదండ్రులు చెబుతున్నది వాస్తవం కాదని అన్నారు. దీంతో, తీవ్ర నిరాశకు లోనైన వారు సుప్రసిద్ధ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డాక్టర్ జార్జ్ బుకానన్ ను కలిశారు. ట్వింకిల్ కేసును శ్రద్ధగా పరిశీలించిన ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఆమె ప్లేట్ లెట్లలోనే సమస్య దాగి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆ దిశగా ట్వింకిల్ కు చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News