: ఢిల్లీలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంత మంది కైలాష్ లు రావాలో!


దేశ రాజధాని ఢిల్లీలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు పిల్లల అక్రమ రవాణాను సమూలంగా రూపుమాపేందుకు మన నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి ఒక్కరే సరిపోరట. మూడు దశాబ్దాలుగా సత్యార్థి పోరు సాగిస్తున్నా, ఇంకా ఢిల్లీలో భాల కార్మిక వ్యవస్థ రూపుమాసిపోలేదు కదా, ఏటికేడు కొత్త సవాళ్లను మన ముందుంచుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీలో 26,473 మంది బాల కార్మికులు (5-14 ఏళ్ల మధ్య వయస్కులు) ఉన్నారట. వీరందరినీ ఆ నరక కూపం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చిన్న చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకుంది. ఏటా 6 వేల మందిని ఈ వ్యవస్థ నుంచి రక్షించాలని నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. 2009 లో నిర్దేశించుకున్న ఈ లక్ష్యంలో భాగంగా 2013 దాకా కేవలం 3,734 మంది బాలలను మాత్రం బాల కార్మిక వ్యవస్థ నుచి బయటపడవేయగలిగారు. అంటే, నెలకు కేవలం 78 మంది పిల్లలకు మాత్రమే విముక్తి లభించిందన్న మాట. మరి, ఢిల్లీలో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలంటే, ఎంతమంది కైలాష్ సత్యార్థిలు రావాలో!

  • Loading...

More Telugu News