: మళ్ళీ మొదలైన పెనుగాలులు... జగదాంబ సెంటర్లో కూలిన వస్త్ర దుకాణాలు
పెనుగాలులు మళ్ళీ మొదలవడంతో విశాఖ వాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే నగరంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకోగా, మళ్ళీ వీస్తున్న ప్రచండ గాలుల ధాటికి ఏం జరగనుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అక్కడ 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనికితోడు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది! అటు జగదాంబ సెంటర్లో వస్త్ర దుకాణాలు కూలిపోయాయి.