: బోరుబావిలో ఐదేళ్ల బాలిక
ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలిక గిరిజ బోరుబావిలో పడిపోయింది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో బాలిక పడిపోవడాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు గిరిజను బయటకు తీసేందుకు శతథా యత్నిస్తున్నారు. అయితే ఇరుకుగా ఉండే సదరు బోరుబావి నుంచి బాలికను బయటకు తీయడం వారికి సాధ్యం కావడం లేదు. దీంతో వారు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.