: తీరంలో మూగబోయిన సెల్ ఫోన్లు
హుదూద్ తుపాను కారణంగా కోస్తా తీరంలో సెల్ ఫోన్లు మూగబోయాయి. గంటలకు 200 కిలో మీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో సెల్ ఫోన్ సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు బలమైన గాలులకు తీరం వెంట పలు ప్రాంతాల్లోని సెల్ టవర్లు కూడా నేలకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రధానంగా విశాఖ పరిధిలో సెల్ ఫోన్ సిగ్నళ్లు పనిచేయడం లేదు.