: లోయర్ సీలేరు విద్యుత్ అందకుండా చంద్రబాబు అడ్డుకున్నారు: హరీష్ రావు


తెలంగాణ రాష్ట్రానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని టీఎస్ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు బాబే కారణమని... లోయర్ సీలేరు విద్యుత్ తెలంగాణకు దక్కకుండా ఆయన అడ్డుకున్నారని హరీష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు చేపట్టిన బస్సుయాత్ర... విహారయాత్రలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదంటూ చంద్రబాబును ప్రశ్నించాలని టీటీడీపీ నేతలకు సూచించారు.

  • Loading...

More Telugu News