: భీమిలి వద్ద తీరం దాటనున్న హుదూద్
హుదూద్ తుపాను మరి కాసేపట్లో విశాఖ సమీపంలోని భీమిలి వద్ద తీరం దాటనుంది. ప్రస్తుతం అది విశాఖ తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. హుదూద్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో హుదూద్ పయనిస్తోందని అధికారులు తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో 5 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి.