: కుప్పకూలిన విశాఖ ఆర్డీవో ఆఫీస్
తీరం దాటక ముందే విశాఖపట్నంలో హుదూద్ తుపాను తన ప్రతాపాన్ని చూపుతోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం విశాఖను వణికిస్తోంది. గాలుల తీవ్రతకు జనం ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది. నగర రోడ్ల మీద పెద్దపెద్ద చెట్లు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో, గాలుల తీవ్రతకు, వర్షానికి విశాఖలోని ఆర్డీవో ఆఫీసు కుప్పకూలింది. నగరంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కొంతమేర దెబ్బతింది.