: అల్లకల్లోలంగా విశాఖ తీరం
హుదూద్ ప్రభావంతో విశాఖ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఆర్కేబీచ్, రుషికొండ, భీమునిపట్నం, యారాడ ప్రాంతాల్లో సముద్రం ఏకంగా 20 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది. ఫిషింగ్ హార్బర్ లో తీవ్ర అలల తాకిడికి రక్షణ గోడ కూలిపోయింది. దీంతో, మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ నుంచి వెళ్లే విమాన, రైలు, బస్సు సర్వీసులను నిలిపివేశారు. జాతీయ రహదారిపై గత సాయంత్రం 7 గంటల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తీవ్ర గాలుల నేపథ్యంలో, విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇళ్లను వదలటానికి సిద్ధంగా లేని వారిని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.