: తుపానును ఆపలేం...నష్టం జరగకుండా చేద్దాం: బాబు పిలుపు


తుపానును మనం ఎవరం ఆపలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తుపాను ముప్పు ముంచుకొస్తోందని అన్నారు. తుపాను బారిన పడకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూద్దామని ఆయన సూచించారు. పూరిళ్లలో ఉండకుండా పునరావాస ప్రాంతాలకు తరలాలని ఆయన సూచించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో నివాసం ఉండాలని ఆయన కోరారు. మనం పూడ్చలేని నష్టం జరిగినా తిరిగి కోలుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుందామని ఆయన సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు. విద్యుత్ స్తంబాలు, తీగల దరిదాపుల్లో ఎవరూ ఉండొద్దని ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం, రాష్ట్రం అన్ని విధాలా బాధితులను ఆదుకుంటాయని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News