: వైజాగ్ విమానం శంషాబాద్ లో ఆపేశారు
ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపేశారు. విశాఖలో వాతావరణం భయానకంగా ఉండడంతో విమానాన్ని శంషాబాద్ లోనే ఆపేశారు. మరో రెండు రోజుల వరకు విశాఖపట్టణంలో వాతావరణం భయానకంగా ఉంటుందనే వాతావరణ అధికారుల సూచనలతో విమానాలు రద్దు చేయనున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఇప్పటికే వారు సూచించారు.