: ప్రాణం ఉన్నంతవరకు టీడీపీని వీడను: ఎర్రబెల్లి


తెలంగాణ టీడీపీ నుంచి ఒక్కో నేత జారుకుంటూ... కారెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, టీటీడీపీ కీలక నేత ఎర్రబెల్లి దయాకరరావు కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు చాలా రోజుల క్రితమే వినిపించాయి. కానీ, తలసాని, తీగల లాంటి నేతలు గులాబీ కండువా కప్పుకున్నా... ఎర్రబెల్లి మాత్రం టీడీపీలోనే ఉంటూ పార్టీ తరపున బస్సు యాత్రల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో, ఎర్రబెల్లి టీడీపీలోనే ఉంటారా? లేక టీఆర్ఎస్ లో చేరతారా? అనే సంశయం చాలా మందిలో మొదలైంది. ఈ కన్ఫ్యూజన్ కు ఎర్రబెల్లి తెరదించే ప్రయత్నం చేశారు. తాను టీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని... ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇతర నేతలు ఎవరూ కూడా టీడీపీని వీడకూడదని హితవు పలికారు. అంతేకాకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా తనదైన శైలిలో విమర్శల వాన కురిపించారు. తమ బస్సు యాత్రకు భయపడే కేసీఆర్ ఢిల్లీలో మకాం పెట్టారని ఎద్దేవా చేశారు. మూడు నెలల నుంచి ఏమీ చేయని కేసీఆర్... తమ బస్సు యాత్రతో కదిలారని విమర్శించారు.

  • Loading...

More Telugu News