: మా బస్సు యాత్రే కేసీఆర్ ను పరుగులు పెట్టించింది: రేవంత్


టీడీపీ నేతలు బస్సుయాత్ర చేపడుతున్నారని తెలిసిన కేసీఆర్ హుటాహుటీన ఢిల్లీకి పరుగెత్తారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బస్సుయాత్రలో మాట్లాడుతూ, మూడు నెలల పాటు కడుపులో చల్ల కదలకుండా కూర్చున్న కేసీఆర్ బస్సుయాత్రతో కదిలారని విమర్శించారు. రాజకీయ వలసలకు సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం బంధువులకు కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఇప్పటి వరకు రైతు సమస్యలపై స్పందించలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News