: ఇక్కడి అవసరాలకు కరెంట్ ఇవ్వరా?: ఈటెల ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పుడు... ఇక్కడి అవసరాలకు ఏపీ నుంచి విద్యుత్ సరఫరా ఎందుకు చేయరు? అంటూ నిలదీశారు. కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రంలో తమకు 54 శాతం వాటా ఉందని... అయినా కరెంట్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు.