: బైకులు ఢీకొని బాంబులు పేలాయి
హైదరాబాదులోని సంఘీనగర్ లో బాంబుపేలుడు కలకలం రేగింది. అడవి పందులను వేటాడేందుకు మెయిన్ రోడ్డుపై ద్విచక్రవాహనంపై నాటు బాంబులతో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. వారి వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో ఒక్క సారిగా బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న వాహనదారు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.