: ఉన్నత కులంలో పుట్టినా... కులాన్ని త్యజించిన మన నోబెల్ గ్రహీత


మదర్ థెరిస్సా తర్వాత నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన రెండో భారతీయుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన వ్యక్తి కైలాశ్ సత్యార్థి. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా, బాలల హక్కుల కోసం గత 30 ఏళ్లుగా అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తున్న యోధుడిగా కైలాశ్ సత్యార్థి మనకు తెలుసు. కాని, అతని ఉన్నతమైన వ్యక్తిత్వమేంటో తెలియజేసే అంశం మరొకటి ఉంది. మధ్యప్రదేశ్ లోని అగ్రవర్ణ బ్రాహ్మణ కుటుంబంలో కైలాశ్ జన్మించారు. ఆయన పేరులోనే కులాన్ని తెలియజేసేలా తోక కూడా ఉండేది. అయితే, అన్ని కులాలు ఒకటే అని... ప్రజలను కులం ఆధారంగా విభజించడం అత్యంత దారుణమని చిన్ననాటి నుంచే కైలాశ్ నమ్మేవారు. దీంతో, తన పేరులో కులాన్ని సూచించే తోకను తొలగించుకుని... కేవలం కైలాశ్ సత్యార్థిగా మారారు. మరో విషయం ఏమిటంటే... ఆయనకు 29 ఏళ్ల వయసు గల కుమార్తె ఉన్నారు. ఆమెకు కూడా ఎలాంటి కుల సంబంధం లేని పేరును సింపుల్ గా 'అస్మిత' అని పెట్టారు. ఇంత ఉన్నతమైన భావాలు ఉండబట్టే కైలాశ్ సత్యార్థి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగగలిగారు.

  • Loading...

More Telugu News