: అబ్బాయిల్లో అమ్మాయిలు మెచ్చే లక్షణాలు!
మగవారిలో అమ్మాయిలు ఇష్టపడే లక్షణాలు ఏమిటి? అంటే, డబ్బున్న వాళ్ళని బాగా ఇష్టపడతారని మనం అనుకుంటాం. అయితే, ఈ అభిప్రాయం తప్పని చెబుతున్నారు సైకాలజిస్టులు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్సిటీ సర్వే చేసింది. అందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఛలోక్తులు విసురుతూ హాస్యపూరకంగా వుండే అబ్బాయిలని అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. హ్యూమరస్ గా ఉండే అబ్బాయిలను ఎందుకు ఇష్టపడతారంటే... వారిలో ఉండే 8 లక్షణాలు అమ్మాయిలను బాగా ఆకర్షస్తున్నాయట. అవేమిటంటే .. ఫన్నీగా ఉండడం, క్రియేటివ్ గా ఉండడం, అందరితో కలసిపోవడం, మంచి పరిశీలనా శక్తి కలిగి ఉండడం, బాధ్యతగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, సమ్మోహనంగా ఉండడం, నవ్వుతూ నవ్విస్తూ ఉండడం! ఈ లక్షణాలు అబ్బాయిల్లో ఉంటే అమ్మాయిలు వారి వెంట కచ్చితంగా పడతారని సర్వేలో తేలింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయితో ఉంటే బోర్ కొట్టడం అనేది ఉండదని... ప్రతి క్షణం కొత్తగా ఉంటుందని అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్ గా ఉండే అబ్బాయిలు సాధారణంగా హ్యూమరస్ గా ఉంటారని వారు పేర్కొంటున్నారు. అందరితో కలసిపోయే వారిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగల తత్వం ఉంటుందని వారు చెప్పారు. మంచి పరిశీలనా శక్తి ఉన్న అబ్బాయిలు మూడ్ కు అనుగుణంగా నడుచుకుంటారని, అమ్మాయిలను సరిగ్గా అర్థం చేసుకుంటారని వారు తెలిపారు. బాధ్యత గలిగిన అబ్బాయిలు అనుక్షణం కంటికి రెప్పలా కాచుకుంటారని, వారి దగ్గర సేఫ్ గా ఉండొచ్చనే ఫీలింగ్ ఉంటుందని ఎక్కువ మంది అమ్మాయిలు వెల్లడించారు. ఆత్మవిశ్వాసం కలిగిన అబ్బాయిల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవని వారు అభిప్రాయపడ్డారు. అనుక్షణం నవ్వుతూ ఉండే అబ్బాయిలను చూస్తే ఎవరైనా ఇంప్రెస్ అవుతారని అమ్మాయిలు భావిస్తున్నారు. ఈ లక్షణాలన్నీ పెంపొందిచుకుంటే అమ్మాయిలే వెంటపడతారట!