: వైయస్ జగన్ ఇంటి ముందు రైతుల ధర్నా
వైకాపా అధినేత జగన్ కు రైతులు షాక్ ఇచ్చారు. గురజాల నియోజకవర్గ పరిధిలో సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములు కోల్పోయిన రైతులు... హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు ఏకంగా ఆందోళనకు దిగారు. సొంత పొలాల్లో ఉన్న రైతులపై వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకట్ రెడ్డి దాడి చేశారని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. దాడిలో గాయపడిన రైతులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.