: పాస్ పోర్టు దరఖాస్తు చేసుకునే వారికి మరో సదుపాయం
పాస్ పోర్టు దరఖాస్తు చేసుకునే వారికి మరో సదుపాయం అందుబోటులోకి వచ్చింది. ఇక నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ తో దరఖాస్తుదారుడికి అన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు అందిన 21 రోజుల్లో పోలీసు విచారణ పూర్తవుతుంది. ఈ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. కొత్త సేవలపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించి మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.