: మా అకౌంట్లు తొలగిస్తే చంపేస్తాం: ట్విట్టర్ సిబ్బందికి 'ఇసిస్' హెచ్చరిక


'ఇసిస్' మిలిటెంట్లు మరింతగా బరితెగిస్తున్నారు. తమ సందేశాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడంతో పాటు తమ క్రూరత్వానికి ప్రతీకలుగా నిలిచే వీడియోల విడుదలకు ఇసిస్ మిలిటెంట్లు ట్విట్టర్ ను వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సదరు వీడియోలను క్రమంగా తాము తొలగిస్తున్నామని ట్విట్టర్ సీఈఓ డిక్ కొస్టోలో తెలిపారు. తమ వీడియోలు ట్విట్టర్ లో కనిపించకపోయే సరికి ఇసిస్ మిలిటెంట్లు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారట. ఇకపై తమ అకౌంట్లను తొలగించినా, తమ సందేశాలు, వీడియోలను తొలగించినా ట్విట్టర్ సిబ్బందితో పాటు యాజమాన్యాన్ని హత్య చేస్తామని మిలిటెంట్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరహా బెదిరింపులు తమ సిబ్బందితో పాటు తనకూ చేరాయని కొస్టోలో, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ సదస్సు సందర్భంగా వెల్లడించారు. మిలిటెంట్ల హెచ్చరికల నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో తమకు అర్థం కావడం లేదని కూడా కొస్టోలో ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News