: హుదూద్ పెను విధ్వంసం సృష్టిస్తుంది: హెచ్చరించిన నాసా
ఏపీ తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న హుదూద్ తుపానుపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' హెచ్చరికలు జారీ చేసింది. హుదూద్ పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. హుదూద్ తీరం దాటే సమయంలో 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మేఘాలపై మైనస్ 53 డిగ్రీల అతి శీతల వాతావరణం ఉంటుందని... ఉరుములు, మెరుపులతో హుదూద్ ప్రళయాన్ని సృష్టిస్తుందని నాసా ప్రకటించింది. జాతీయ రహదారులపై రాకపోకలను పూర్తి స్థాయిలో నిషేధించాలని సూచించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది.