: సాయంత్రం నుంచి 5వ నెంబర్ జాతీయ రహదారి మూసివేత


హుదూద్ తుపాను భయానకంగా ఉండబోతోంది. 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, ప్రభుత్వం అన్ని రకాల నష్ట నివారణ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, దేశంలోని అత్యంత ముఖ్యమైన జాతీయ రహదారుల్లో ఒకటైన 5వ నెంబర్ రహదారిని... తుపాను ప్రభావం అధికంగా ఉండే జిల్లాల్లో ఈ సాయంత్రం 7 గంటల నుంచి మూసివేయనున్నారు. ఈ రహదారి తూర్పు తీర ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. సముద్ర తీర ప్రాంతం గుండా వెళుతుంది. దీంతో, తుపాను సమయంలో రహదారిపై అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేస్తున్నారు. కేవలం అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తారు.

  • Loading...

More Telugu News