: హుదూద్ కారణంగా ఏపీలో సురక్షిత ప్రాంతాలకు 4.56 లక్షల మంది
హుదూద్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 4.56 లక్షల మంది ప్రజలు తమ సొంత ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాలపై హుదూద్ పెను ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన 4.56 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి 150 కిలో మీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో తుపాను బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రానికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.