: 60 అడుగులు చొచ్చుకు వచ్చిన సముద్రం... భయం గుప్పిట్లో ప్రజలు
గంటగంటకూ హుదూద్ తుపాను తీరం వైపుకు దూసుకువస్తోంది. ఈ క్రమంలో గాలుల వేగం అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాకుండా సముద్రంలోని అలలు విలయ తాండవం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని బోయపాడు, బంగారంపేట, రాజయ్యపేట గ్రామాల వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ఏకంగా 60 అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. దీంతో, మత్స్యకారులు పడవలు, వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గస్తీ నిర్వహిస్తున్నాయి.