: జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హుదూద్ తుపాను నేపథ్యంలో, అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారాన్ని అందజేస్తూ ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా పొల్గొన్నారు.