: దిశ మార్చుకున్న హుదూద్... శ్రీకాకుళం దిశగా పయనం
విశాఖ తీరం వైపు దూసుకొస్తున్న హుదూద్ తుఫాన్ దిశ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అది శ్రీకాకుళం వైపు పయనిస్తోంది. అందరూ ఊహిస్తున్నట్టు ఆదివారం ఉదయం కంటే ముందుగానే హుదూద్ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని చోట్ల రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. మరికొన్ని చోట్ల 20 అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. అయితే, మార్గమధ్యంలో హుదూద్ మరోసారి తన మార్గాన్ని మార్చుకునే అవకాశాలు లేకపోలేదు.