: చంద్రబాబు, కేసీఆర్ లకు జ్ఞానం ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నా: వైకాపా నేత పొంగులేటి


ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలను చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు వాగ్దానాలను నెరవేర్చే విధంగా జ్ఞానాన్ని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఖమ్మం ఎంపీ, వైకాపా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News