: కైలాష్ స్యతార్థికి ట్విట్టర్ లో ఫాలోయర్ల వెల్లువ!
నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన కైలాష్ సత్యార్థికి ట్విట్టర్ లో ఫాలోయర్లు వెల్లువెత్తుతున్నారట. బహుమతి ప్రకటనకు ముందు ఆయన ట్విట్టర్ అకౌంట్ కు 200లకు మించి ఫాలోయర్లు లేరట. అయితే సత్యార్థి నోబెల్ బహుమతికి ఎంపికైనట్లు ప్రకటన వెలువడిన తొలి 90 నిమిషాల్లోనే ఈ సంఖ్య 4,500లకు పెరిగిపోయింది. తర్వాత కూడా క్షణక్షణానికి ఈ సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. మరోవైపు సత్యార్థి వ్యక్తిగత వెబ్ సైట్, నెటిజన్ల తాకిడికి దాదాపు ఓపెన్ కావడం లేదు. పెద్ద సంఖ్యలో నెటిజన్లు సత్యార్థి వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో నెలకొన్న రద్దీ కారణంగానే సదరు వెబ్ సైట్ తెరచుకోవడం లేదట.